మాజీ భార్య వీడియోలను ఆన్ లైన్లో పెట్టిన భర్త.. కేసు నమోదు!

  • మాజీ భార్య మరో పెళ్లి చేసుకోవడంతో మాజీ భర్త దారుణాలు
  • నగ్న వీడియోలను ఆన్ లైన్లో పెట్టిన వైనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
తన మాజీ భర్త తాము ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలను ఆన్ లైన్లో పెట్టాడంటూ 25 ఏళ్ల ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని పూణెలో ఇది చోటు చేసుకుంది. పూణెకు చెందిన ఈ యువతి గోవాకు చెందిన ఓ యువకుడిని గతంలో పెళ్లాడింది. 2016 నుంచి 2018 వరకు ఆయనతో కలసి ఉంది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో... ఇద్దరూ చట్ట పరంగా విడాకులు తీసుకున్నారు.

అనంతరం పూణెకు చెందిన మరో యువకుడిని ఆమె పెళ్లాడింది. తన మాజీ భార్య మరో పెళ్లి చేసుకుందనే అక్కసుతో... ఆమె నగ్న వీడియోలను మాజీ భర్త ఆన్ లైన్లో పెట్టాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... త్వరలోనే ఆమె మాజీ భర్తను అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Go Back to Shorts
ex husband
ex wife
videos
online

More Telugu News